రూ.229 కోట్ల అభివృద్ధి పథంలో పెందుర్తి నియోజకవర్గం
కపెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు
అక్షర కిరణం (పెందుర్తి): జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బాధ్యత స్వీకరించి గడిచిన సంవత్సర కాలంలో 229 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టినట్టు చెప్పారు. జీవీఎంసీతో రూ.117.79కోట్లతో 423 పనులు చేపట్టామన్నారు. 243 పనులను 71.46 కోట్లతో చేస్తున్నామన్నారు. పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖతో 26.85 కోట్లతో 391 పనులు చేపట్టే 12.62 కోట్లు ఖర్చు చేసి 280 పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 111 పనులను రూ.14.23 కోట్లతో పనులు జరుగుతున్నవని తెలిపారు.
రూ.12.25 కోట్లతో 142 పనులు చేపట్టి 1.79 కోట్లు ఖర్చు చేసి 103 పనులు పూర్తి చేశామన్నారు. మిగిలిన 39 పను లు జరుగుచున్నవి. రోడ్లు భవనాల శాఖ నుంచి రూ.9.78 కోట్లతో 25 పనులు చేపట్టామన్నారు. విద్యుత్ శాఖతో రూ.9.36 కోట్లతో 510 పనులు చేపట్టి రూ.5.37 కోట్లు ఖర్చు చేసి 394 పనులు పూర్తి చేశామన్నారు.
ఇరిగేషన్‌తో 1.00 కోటి రూపాయలతో 16 పనులు చేశామన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో నియోజక వర్గంలో 44 కంపెనీలతో చేపట్టిన మెగా జాబ్ మేళాలో 3020 మంది ఎంట్రీలకు హాజరు కాగా వారిలో 826 మందికి ఉపాధి అవకాశం కల్పించామన్నారు. 238 మందికి త్వరలో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి 28 మంది లబ్ధిదారులకు 72.78 లక్షల వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశామన్నారు.