వలంటీర్ల వ్యవస్థ రద్దుపై పవన్ కీలక వ్యాఖ్యలు
కవారు వ్యవస్థలోనే లేరంటూ వ్యాఖ్యలు
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వలంటీర్ల వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో సర్పంచ్ సంఘాలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఆయన స్పందించారు.
వలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కానీ, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని విమర్శించారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదోక సాంకేతిక సమస్య అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.