పర్యాటక శోభగా పారమ్మకొండ
Åప్రపంచ పర్యటక దినోత్సవంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): ప్రపంచ పర్యాటక దినోత్సవం పారమ్మకొండ వద్ద ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా ప్రారం భించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పాచిపెంట మండలంలో పారమ్మకొండ వెలసి ఉండడం ప్రకృతి అందాలను, పారమ్మకొండ, పర్యాటక శోభగా మరింత తీర్చి దిద్దుతామని, పర్యాటక అభివృద్ధి, అవసరాలను ప్రజలకు వివరించారు. మన్యం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని మంత్రి సంధ్యారాణి అన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఈప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతోపాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచే అవకాశం ఉందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. మంత్రి పిలుపుతో పారమ్మకొండ అభివృద్ధికి పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించిన దాతలు ముందుకు వచ్చారని అన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి సంధ్యారాణి. తెలిపారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ నాయకులు పాచిపెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.