కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ..
పవన్‌పై ప్రకాష్ రాజ్ తాజా ట్వీట్ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో సైలెంట్ మోడ్‌లో పవన్
అక్షర కిరణం, (హైదరాబాద్): తిరుమల లడ్డు వివాదం లో నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తునే ఉన్నారు. ఈ వివాదంలో ఎటువంటి నిజాలు లేకపోయిన ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్‌రాజ్ తన ఘాటైన ట్వీట్లతో ప్రశ్నిస్తూ ఆత్మరక్షణలో పడేస్తున్నవైనం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ట్వీట్లకు ఏ సమాధానం చెప్పాలో తెలియక పవన్ తలపట్టుకుంటుండంతో ఆయన అభిమానుల్లో సైతం పవన్‌పై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రకాష్‌రాజ్ పవన్ నిజస్వరూపాన్ని ట్వీట్లతో బట్టబయలు చేస్తున్నారని పవన్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. తాజాగా ప్రకాష్‌రాజ్ ‘కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. ఇక చాలు ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి అంటూ పవన్‌పై మరో ట్వీట్ చేశారు.
ఇక అంతకు ముందు ‘’దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి జస్ట్ ఆస్కింగ్. అంటూ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు అంతకు ముందు ‘’మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగా లను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా ? లేక ప్రజల మనోభావాలు గాయపడ కుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితం గా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. లడ్డు వివాదాన్ని పవన్ కళ్యాణ్ పెద్దది చేసి మాట్లాడుతున్నారని ప్రకాష్‌రాజ్ తన ట్వీట్లతో బయటపెడుతున్నారు. తాజాగా సుప్రీం కోర్టు సైతం ఏపీ ప్రభుత్వానికి అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మీద ఫైర్ అవ్వగా ప్రకాష్ రాజ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం గమనార్హం. తాజాగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన పంగనామాల ట్వీట్‌తో మరోసారి పవన్ ఆత్మరక్షణ ధోరణిలో పడ్డారని ప్రజలు చర్చించుకుంటున్నారు.