డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ప్రమాణ స్వీకారోత్సవంలో పంచకర్ల, సీఎం రమేష్
అక్షర కిరణం (పెందుర్తి): విశాఖ జిల్లా డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు ప్రమాణస్వీకారం మహోత్సవంలో పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. సోమవారం 2న విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డిస్ట్రిక్ట్ కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీ సీబీ) విశాఖ జిల్లా చైర్మన్గా కోన తాతారావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచ కర్ల రమేష్ బాబు పాల్గొని శాలువతో సత్కరించి పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అనకా పల్లి ఎంపీ సీఎం రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.