తమ్మిరెడ్డి శివశంకర్‌కు జనసేన నేతల సన్మానం
అక్షర కిరణం, (సాలూరు): జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల చైర్మన్, తమ్మిరెడ్డి శివశంకర్‌ను జనసేన పార్టీ నాయకులు సన్మానించారు. జనసేన సాలూరు పట్టణ నాయకులు జరాజాపు ఈశ్వర రావు, జరజాపు సూరిబాబు సోదరులు తదితర పార్టీ నాయకులతో విశాఖపట్నంలోని శివశంకర్ నివాసంలో గురువారం మర్యాదకపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈసంద ర్భంగా జరజాపు ఈశ్వరరావు మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి సాలూరు పట్టణ, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతామని కూటమి ప్రభుత్వంతో కలసి మరింత అభివృద్ధికి ముందుకు సాగుతుందన్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చొరవతో పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధికి మౌలిక సదుపాయల ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి సాగుతుందని అన్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం జనసేనపార్టీ రీజినల్ కార్యదర్శి చిన్నతరహా పరిశ్రమల చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ కూటమి నాయకులు కార్యకర్తలు కూడా అభివృద్ధి సంక్షేమానికి పాటుపడి కూటమి నాయకులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు ఆదాడ మోహనరావు, చింత కాశీ నాయుడు, పెంట తిరుపతిరావు, జరజాపు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.