పోక్సో నిందితుడికి బాలికల పాఠశాలలో జాబ్
Å22 మంది విద్యార్థినులను లైంగిక వేధించిన గణపత్ అరెస్టు
అక్షర కిరణం, (మహారాష్ట్ర/జాతీయం): మహారాష్ట్ర లోని ఠాణె జిల్లాలో గల ఒక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగు చూసింది. పాఠ శాలలోని 22 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పాఠశాల వంటవాడు గణపత్ గవిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇతడు గతం లోనే పోక్సో కేసులో జైలుకు వెళ్లి రాగా.. ఇతడికి బాలికల పాఠశాలలో ఉద్యోగం ఎలా ఇచ్చారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పోలీసులు సైతం దీనిపై ఆరా తీస్తున్నారు.
భోజనం కోసం వస్తే లైంగిక దాడి
ఠాణె జిల్లాలోని తెంబా ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. భోజనం పెట్టే సమయంలో నిందితుడు గణపత్ గవిల్ తమను అసభ్య కరంగా తాకుతూ, కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తు న్నాడని బాధిత విద్యార్థినులు ఆగస్టు 24వ తేదీన పోలీసు లకు ఫిర్యాదు చేశారు. చిన్నారి విద్యార్థినుల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు.. పాఠ శాల యాజమాన్యంతో మాట్లాడి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు.
గతంలోనూ పోక్సో కేసు.. విధుల్లోకి ఎలా వచ్చాడు?
ఆపై నిందితుడి గురించి పూర్తి స్థాయిలో ఆరా తీయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అతడు గతంలోనే పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు గుర్తించారు. నిందితుడైన గణపత్ గవిల్ గతంలో.. వేరే ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో కూడా పలువురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఆ ఘటనపై నాడు పోక్సో చట్టం కింద కేసు నమోదు కాగా.. అధికారులు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ కేసులో నిందితుడు కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించి బయటకు వచ్చాడు.
తీవ్రమైన పోక్సో నేరచరిత్ర ఉండి, జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తిని మళ్లీ మరో పాఠశాలలో వంటవాడిగా ఎలా నియమించా రనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అతడిని ఎవరు విధు ల్లోకి తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా నియామకం ఎలా జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.