హిందూ సంప్రదాయంలో ఒక్కటైన అస్ట్రేలియ దేశపు జంట
Åసీఐ విద్యాసాగర్ కుమారుడు రణ సూర్య వివాహానికి హాజరైన అస్ట్రేలియాలోని సీVAద్యోగులు
Åహిందూ వివాహం సంప్రదాయానికి ఆకర్షితులై అదే వేదికపై వివాహం చేసుకున్న అస్ట్రేలియా జంట
అక్షర కిరణం, (విశాఖపట్నం): వసుదైక కుటుంబకం అనే మన హిందూ సంప్రదాయం విదేశీయులను ఎంతగానో ఆకర్షిస్తోంది. మన హిందూ వివాహ సంప్ర దాయం, సంస్కృతి ప్రపంచంలోని పలు దేశాల వాసులను ఆకట్టుకుంటోంది. మÖడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచే మన సంప్రదాయానికి వారు ముగ్దులవుతు న్నారు. దీనిలో భాగంగా తాజాగా విశాఖ పట్నం షీలానగర్‌లో జరిగిన ఓ తెలుగు జంట వివాహ మీVAత్సవానికి విచ్చేసిన అస్ట్రేలియా దేశవాసులు హిందూ వివాహ సంప్రదాయాన్ని చూసి ఆకర్షితులై వారు కూడా నూతన వధూవరులు వివాహం చేసుకున్న అదే వేదికపై మన హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటై ఈ వివాహానికి వచ్చిన అతిథులు, ప్రముఖుల ఆశీర్వాదం అందుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం షీలా నగర్ సమీపంలోని నమస్వి కల్యాణ మండపంలో సీఐ సంపత్ రావు విద్యాసాగర్, పుష్పలత దంపతుల ఏకైక కుమారుడు సంపత్ రావు రణ సూర్య సృజనల వివాహం ఈనెల 27న గురువారం ఘనంగా జరిగింది. వరుడు సంపతిరావు రణ సూర్య ఆస్ట్రేలియా దేశంలో జైలు అధి కారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈక్రమం లో అక్కడి రణసూర్య సీVAద్యోగులు, సిబ్బంది అస్ట్రేలియా నుంచి ఈ వివాహానికి విచ్చేశారు. వారు హిందూ సంప్రదాయంలో జరిగిన రణసూర్య వివాహాన్ని చూసి ఇక్కడి హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ఆకర్షితులయ్యారు. దీంతో అస్ట్రేలియాకు చెందిన ఇద్దరు జైలు అధికారులు నూతన వధూవరులు రణసూర్య సృజనల వివాహం జరిగిన అదే కల్యాణ మండపంలో అదే వేదికపై అచ్చ తెలుగు సంప్రదాయంలో హిందూ వివాహ రీతిలో వివాహం చేసు కుని అతిథుల ఆశీస్సులను అందుకున్నారు. ఈ వివాహ మీVAత్సవంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు, ప్రభుత్వ విప్ గణబాబు, కూటమి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు, పలువురు రాజకీయ ప్రము ఖులు, ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య నిపుణులు, వైద్యాధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత న్యాయమÖర్తు లు, న్యాయనిపుణులు, పాత్రికేయ ప్రముఖు లు తదితరులు పాల్గొని ఈ రెండు జంటల ను ఆశీర్వదించారు.