గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్..
Åఉచితంగా నీట్, ఐఐటీ-జేఈఈ శిక్షణ.. హాస్టల్, భోజనం ఫ్రీ
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం ఎక్స్‌లెన్స్ సెంటర్ (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లాలోని మారికవలసలో ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ సెంటర్ సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కమిషనర్ గౌతమి తెలిపారు. ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లో.. గిరిజన విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటుగా జేఈఈ, నీట్ శిక్షణ అందిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల్లో సాధిం చిన మార్కులు ఆధారంగా ఈ ఏడాది ఫస్టియర్, సెకండి యర్కు కలిపి 600 మంది విద్యార్థులను ఎంపిక చేయగా.. వీరిలో 50 శాతం బాలికలున్నారు.
ఈ సెంటర్లో మొత్తం 600 మంది ఇంటర్మీడి యట్ విద్యార్థులలో.. 300 మంది అబ్బాయిలు, 300 మంది అమ్మాయిలు ఉంటారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీలో బాలురు 75 మంది, బాలికలు 75 మంది ఉంటారు.. సెకండియర్ ఎంపీసీలో బాలురు 75 మంది, బాలికలు 75 మంది ఉంటారు. సెకండియర్ బైపీసీలోనూ ఇదే తరహాలో అడ్మిషన్లు ఉంటాయి. ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్లో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఎంపికైన విద్యార్థులకు ఎక్స్‌లెన్స్ సెంటర్లో వసతి, భోజన సౌకర్యం అందిస్తారు. ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్‌కు అవసరమైన వసతులు, ఫర్నీచర్, ఐసీటీ సదుపాయాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సెంటర్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా పనులు చేపట్టారు. విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నీట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ విద్యార్థుల కు అత్యుత్తమ, సమగ్ర రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తారు.
మరోవైపు మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఎక్స్‌లెన్స్ సెంటర్‌గా మార్చడం.. అక్కడ చదువుతున్న విద్యార్థుల్ని తరలించడం ఉద్రిక్తంగా మారింది. ఐటీడీఏ అధికారులు విద్యార్థుల్ని తరలిస్తుండగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనుకు దిగారు. ఎమ్మెల్సీ రవిబాబు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. అధికారులు అందరికి సర్దిచెప్పి విద్యార్థుల్ని అక్కడి నుంచి తరలించారు. 5,6,7,8 తరగతులు చదువుతున్న 226 మంది విద్యార్థులను మారికవలస గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు తరలించారు. 9, 10 తరగతులకు చెందిన 208 మంది విద్యార్థులను పార్వతీపురం జోగింపేట గిరిజన గురుకులానికి తరలిం చారు. మిగతా 56 మంది విద్యార్థులను సమీపంలోని గురుకులాలకు తరలించారు.