నిబంధనలకు విర్ధుంగా ఉన్న నిర్మాణాలపై అధికారుల చర్యలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ నార్త్ జోన్ పరిధిలో నిర్మాణాలకు అవసరమైన అనుమతులు లేకపోవ డం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొన్ని రోజులుగా తని ఖీలు చేసి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మాధవధారలో జీవీఎంసీ అధికారు లు కొరడా ఘళ్ళిపించారు. అనధికారికంగా నిర్మిస్తున్న అద నపు అంతస్తును జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని, నిబంధనలు ఉల్లంఘిం చి చేపట్టే నిర్మాణాలపై అవసరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. సచివాలయ, టౌన్ప్లాన్ సిబ్బంది నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులు ఆదేశించారు.