ఇకపై అన్ని పనిదినాల్లో పీజీఆరఎస్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజా సమస్యల పరి ష్కార వేదిక (పీజీఆరఎస్) కార్యక్రమాన్ని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. కేవలం సోమవారం మాత్రమే కాకుండా.. అన్ని పనిదినాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పీజీఆరఎస్ కార్యక్రమం చేపట్టి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
మనకు ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లా లన్నా, ఏవైనా అంశాలపై ఫిర్యాదులు చేయాలన్న ఉన్న మార్గం.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆరఎస్). ప్రతీ సోమవారం మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులను కలిసి ప్రజలు తమ సమస్యల పరిష్కారంపై అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. వారంలో ఒక్క రోజు, అది కూడా సోమవారం మాత్రమే ఈ పీజీఆరఎస్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. దీంతో ఏదైనా అర్జీ అందించాలంటే సోమవారం వరకూ ఆగాల్సిన పరిస్థితి. ఇకపై ఈ ఇబ్బంది తప్పనుంది. ప్రజలు అర్జీలు సమర్పించేందుకు ఇకపై సోమవారం వరకూ నిరీ క్షించాల్సిన అవసరం లేదు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాల యాలలో అన్ని పనిదినాలలో పీజీఆరఎస్ నిర్వహించను న్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల నేపథ్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆరఎస్) కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలో కార్యాలయాల్లో సిబ్బంది కచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రజలు అందించే అర్జీలను స్వీకరించి, పరిష్కారానికి సంబంధించిన సమాచారం తెలపాల్సి ఉంటుంది. అలాగే ఆయా అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారుల వద్దకు పంపించి.. పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా రెవెన్యూ, వ్యవసాయ సహాయకులు, సర్వే, పశు సంవర్థక శాఖ, ఇంజినీరింగ్ సహాయకులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
మరింత పారదర్శకంగా పీజీఆరఎస్..
మరోవైపు పీజీఆరఎస్ కార్యక్రమాన్ని మరింత పారదర్శకం గా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిం చనున్నారు. ఇందుకోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉపయోగి స్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ప్రజల తమ అభిప్రా యాలను, స్పందనను తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సమర్పించే అర్జీల పరిష్కారం, వాటి స్థితి, ప్రజా స్పందన తెలియజేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్త్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు ఈ ఆదేశాలు కూడా జారీ చేశారు.