విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
Åరూ.2వేల కోట్ల పెట్టుబడి, 9వేలమందికి ఉద్యోగాలు
అక్షర కిరణం, (ఎండాడ/విశాఖపట్నం): ఆసియా లోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఏపీ ప్రజలకు అందుబాటులోకి రానుంది. విశాఖ పట్నం జిల్లా ఆనందపురం మండలం ఎండాడ దగ్గర ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అంతకముందు ఎండాడ వద్ద వేదిక ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఏఐజీ హాస్పిటల్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఏఐజీ ఆస్పత్రి వెయ్యి పడకలతో అందుబాటులోకి రానుంది.
విశాఖపట్నంలో ఏఐజీ ఆసుపత్రి నిర్మాణా నికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఏఐజీ ఆస్పత్రి సేవలు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఐజీ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు పాల్గొన్నారు.
ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఏఐజీ ఆసుపత్రి హైదరాబాద్ లో మాత్రమే ఉంది.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ అందు బాటులోకి రానుంది. ఏఐజీ దశలవారీగా ఐదేళ్లలో రూ.2 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.. 9 ఎకరాల్లో ఆస్పత్రి.. 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయనుంది. ఏఐజీ రాకతో 9వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటున్నారు. ఏఐజీ మొదటి దశలో టవర్-A , టవర్-దీ లలో 650 పడకలతో 2028నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండో దశలో టవర్-్పు తో 350 పడకల సామర్థ్యంతో మరో రెండేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు. నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు, సిబ్బందికి వసతిగృహాలు, రోగులకు తక్కువ నగదు చెల్లింపుతో గదుల నిర్మాణానికి ప్లాన్ చేశారు.
విశాఖపట్నం ఏఐజీలో వైద్య సేవలు, శిక్షణ, పరిశోధన, రోగులు, వారి కుటుంబసభ్యులకు అవసరమైన సకల సౌక ర్యాలతో హెల్త్ కేర్, ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నంలో నిర్మించనున్న ఏఐజీ మెడికల్ క్యాంపస్‌లో 50కి పైగా సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తారు. 8 మెయిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు, మదర్ అండ్ చైల్డ్ కేర్ విభాగం ఉంటుంది. నర్సింగ్ కాలేజీ, పారామెడికల్ ట్రైనింగ్ సెంటర్, అధునాతన రీసెర్చ్ ల్యాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్‌కేర్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఏఐజీతో ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాద్ వెళ్లే పనిలేకుండా ఉత్తమ వైద్య సేవలు విశాఖపట్నంలో అందుబాటులోకి రానున్నాయి.