మాధవధారలో సైకిల్‌పై నార్త్ జోన్ జెడ్సీ పర్యటన
అక్షర కిరణం, (మాధవధార): మాధవధారలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించేం దుకు జీవీఎంసీ నార్త్‌జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము సోమవారం సైకిల్‌పై పర్యటించారు. జీహెచఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం సైకిల్‌పై విధులకు హాజరవుతున్న ఆయన.. మాధవధార పరిధిలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థి తులను పరిశీలించారు. ఇంటింటికీ చెత్త సేకరణ తప్పని సరి పర్యటనలో భాగంగా క్లాప్ (సీఎలఏపీ) వాహనాల పనితీరును కమిషనర్ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించే ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి చెత్త సేకరణ లో జాప్యం జరిగినా, వాహనాలు నిర్ణీత ప్రాంతాలకు వెళ్లక పోయినా సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాధవధారలోని దుకాణాలు, వ్యాపార సముదాయాలను కూడా కమిషనర్ పరిశీలించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి గా నిషేధించాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వినియో గం, విక్రయాలు కొనసాగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయాలకే పరి మితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసు కుని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం సైకిల్ పై పర్యటిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ప్లాస్టిక్ నియంత్రణ వంటి అంశాలపై నిరంతర పర్య వేక్షణ కొనసాగుతుందన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు ఏఎంహెచఓ అప్పలనాయుడు, శానిటర్ ఇన్స్పెక్టర్ బొడ్డేపల్లి సుధాకర్, నార్త్ శానిటర్ సూపర్వైజర్ రామారావు, సూపర్వైజర్ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు.