పీజీఆరఎస్లో 163 వినతుల స్వీకరణ
అక్షర కిరణం, (శ్రీకాకుళం): క్యూ అర్ కోడ్ ను ఉపయోగించుకొని అర్జీదారులు పెట్టుకున్న అర్జీ నంబర్‌కు ఫీడ్ బ్యాక్ ఇవ్వగలరని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీ లు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్‌తో కలసి ఆయన సోమవారం అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ అర్జీలు సత్వ రమే పరిష్కరించాలని ఆదేశించారు. 163 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ 63, పంచాయతీ రాజ్ 14, పట్టణ, పరిపాలన శాఖ 12, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 11, గృహ నిర్మాణ శాఖ 7, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ 6, పంచాయతీరాజ్ ఇంజనీ రింగ్ 5, స్కిల్ డెవలప్మెంట్ 5, హోంశాఖ 5, వాటర్ రిసోర్స్ ఈఎన్సి 4, ఏపీ ఈపీడీసీఎల్ 4, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డ్ 4, గ్రామీణ నీటి సరఫరా 3, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2, గ్రామీణాభివృద్ధి 2, విద్యాశాఖ 2, ఏపీఎసఆర్టీసీ 2, సమగ్ర శిక్ష 2, హార్టికల్చర్, దేవాదాయ శాఖ, కుటుంబ సంక్షేమం, ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జియాలజీ, మహిళ స్త్రీ శ్రీ సంక్షేమం, తదితర శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డిప్యూటీ కలెక్టర్ జయదేవి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.