బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్ రాజు
అక్షర కిరణం, (మాధవధార): బీజేపీ నగర అధ్యక్షుడిగా పి.పరశురామ్ రాజు నియమితులయ్యారు. ఈసందర్భంగా పరశురామ్ రాజుకు పలువురు బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా పరశురామ్రాజు మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడంలో సహకరించిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు, బీజేపీ రాష్ట్ర నాయకుడు సాగి కాశీవిశ్వనాథ్రాజుకు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావుకు, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, అభిమానులు పరశురామ్ రాజుకు పూల కిరిటం పెట్టి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు.