పబ్లిక్ గ్రీవెన్స్‌కు విశేష స్పందన
అక్షర కిరణం, (విశాఖపట్నం): ప్రజా సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా శుక్రవారం విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇన్చార్జ్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైైర్మన్ సీతంరాజు సుధాకర్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ వార్డుల నుండి వచ్చిన ప్రజల సమస్య లపై అర్జీలను, వినతిపత్రాలను స్వీకరించారు. వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న అర్హుల నుండి ముఖ్య మంత్రి సహాయ నిధి దరఖాస్తులను కూడా ఆయన స్వీక రించారు. ప్రతి దరఖాస్తుదారునితో నేరుగా మాట్లాడి సమ స్యలను అడిగి తెలుసుకున్న సుధాకర్, గతంలో వచ్చిన అర్జీల పరిష్కార పురోగతిని సమీక్షించారు. పరిష్కారం కాని సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసు కెళ్లి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామ కంఠం ప్రాంతాలను సందర్శించిన జీవీఎంసీ కమిషనర్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కేతన్ గార్గ్ పెందుర్తి జోన్ పరిధిలోని 97వ వార్డు పులగవానిపాలెం గ్రామ కంఠం ప్రాంతాన్ని గురువారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు, పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకరరావుతో కలిసి సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ కంఠంలో నివసిస్తున్న కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామకంఠంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ తమ ఇళ్లకు ఇప్పటివరకు ఆస్తి పన్నులు లేనందున మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని, తాగునీటి, కొళాయిలు, విద్యుత్ సదుపాయం, రహదారులు, డ్రైనేజీ కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్‌కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ, పులగవానిపాలెం గ్రామ కంఠంలో ప్రస్తుతం ఎన్ని ఇళ్లు ఉన్నాయని, ఎన్ని కుటుంబాలు నివసిస్తు న్నారని, వారు ఎప్పటి నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని జోనల్ కమిషనర్ ను, డీసీఆర్‌ను ఆదేశించారు. గ్రామ కంఠానికి సంబంధిం చిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఈ పర్యటనలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.