విద్యార్థులు నిరసనల్లో పాల్గొనకుండా ఆదేశాలు, ఆ వెంటనే యూటర్న్
Åవెనక్కి తగ్గిన సీఎం విజయ్
అక్షర కిరణం, (చెన్నై/జాతీయం): తమిళనాడులో విద్యార్థులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన కుండా చర్యలు తీసుకోవాలనిజారీ చేసిన ఆదేశాలపై తీవ్ర విమర్శలు రావడంతో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నిరసనల నుంచి విద్యా ర్థులను దూరంగా ఉంచాలని ఆగస్ట్ 17వ తేదీన తమిళ నాడు కాలేజీ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది. విద్యార్థుల నిరసనలపై విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఒక్క రోజు లోనే మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కళాశాల విద్యా డైరెక్టరేట్(డీసీఈ) నుంచి ఆగస్ట్ 17వ తేదీన కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టే ఆందోళనలు, నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా చర్యలు తీసుకోవా లని అందులో సూచించారు. పాఠశాల విద్యా శాఖ, ఉన్నత విద్యాశాఖ, పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయం తో అవసరమైన చర్యలు చేపట్టాలని సర్కార్ ఆదేశించారు.
విద్యార్థులు, యువత నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూసే అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని కూడా ఆ ఆదేశాల్లో విద్యా శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయా కాలేజీలు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలకు వర్తించేలా జారీ చేశారు.
అయితే.. విద్యార్థులు నిరసన తెలిపే హక్కును అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయడంపై విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. విద్యార్థులకు తమ అభిప్రా యాలను వ్యక్తం చేసే హక్కు ఉందని.. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనడాన్ని నిరోధించడం సరికాదనే అభిప్రా యాలు వెల్లువెత్తాయి. ఇటీవల విద్యార్థి కార్యకలాపాల్లో తాను కూడా చురుకుగా పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. విద్యార్థులకు నిరసన తెలిపే ప్రాథమిక హక్కు ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్న అంశం కూడా ఈ సమయంలో ప్రస్తావనకు రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కొలీజియేట్ ఎడ్యుకేషన్ సింథియా సెల్వి పి.. ఆగస్ట్ 17వ తేదీన జారీ చేసిన కమ్యూనికేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఈ సమాచారాన్ని పంపించారు.
ఆగస్ట్ 15వ తేదీ నుంచి ‘స్కూల్ థిక్ కరో’ ప్రచారాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో ఈ పరిణా మం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు పలు డిమాండ్లతో నిరసనల్లో పాల్గొంటున్న సమయంలోనే తమిళ నాడు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిరసనల కు వామపక్ష పార్టీల నుంచి కూడా మద్దతు లభించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల నిరసనలను కంట్రోల్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు రాజకీ యంగా కూడా చర్చకు దారితీశాయి. అయితే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం కేవలం 24 గంట ల్లోనే నిర్ణయాన్ని మార్చుకోవడం ఆసక్తికరంగా మారింది.