సాలూరులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల్లో ప్రారంభిస్తామని జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారి ఐ.గంగాధరరావు తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అయన తెలిపారు. నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల రైతులు దీనిని సద్విని యోగం చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పత్తి రైతులు ఈమార్కెట్ యార్డుకు వచ్చి పత్తిని విక్రయించు కోవాలని కోరారు. రైతులు దళారుల మాటలు విని రైతులు మోసపోవద్దని ఆయన ప్రకటనలో కోరారు.