స్వార్థపరులే పార్టీ మారుతున్నారు
Åవైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ
అక్షర కిరణం, (విజయనగరం): స్వార్థపరులే పార్టీ మారుతున్నారని, ఎక్కడ అధికారం, లాభం ఉంటే అటువైపు వెళ్లే ఒకరిద్దరి వల్ల పార్టీకి కలిగే నష్టం ఏమీ ఉండదని వైసీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని వైసీపీ కార్యాలయంలో సోమ వారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని, ఇప్పుడు వలసలు వెళ్లిన వారు బాధపడే పరిస్థితి వస్తుంద న్నారు. మొన్నటి వరకు దుర్మార్గుడన్న నాయకుడిని నేడు దేవుడిగా వాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి తన కుమార్తె పోటీ చేస్తుందని ఏనాడు ప్రకటించలేదని, అవకాశం వస్తే పోటీలో ఉంచు తానన్న మాటే చెప్పానన్నారు. కొందరు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించినా అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ అధి నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ విషయం ప్రజలకు తెలుసని, ఇచ్చిన హమీలు అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్న వారికి తగిన బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పాల్గొన్నారు.