9న దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష
అక్షరకిరణం, (కోల్కతా/జాతీయం): కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈనిరసనలకు సంఫీుభావంగా అక్టోబరు 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రకటించింది. ఫైమా సమావేశం లో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పని వాతావరణం మెరుగుపడాలనేది వారి డిమాండ్ అని తెలిపారు.