సీసీ బస్సులపై అధికారుల తనిఖీలు
48 కేసులు నమోదు
అక్షర కిరణం, (మాధవధార): ఈనెల 17 నుంచి 20 వ తేదీ వరకు కాంట్రాక్ట్ క్యారేజ్ (సీసీ) బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో మొత్తం 48 కేసులు నమోదు చేసి రూ. 5,24,600 చలానా విధించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం, ఎమర్జెన్సీ డోర్స్ పనిచేయకపోవడం, ఇతర మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, రోడ్డు భద్రతకు సంబంధించిన కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని విశాఖపట్నం ఉపరవాణా కమిషనర్ తెలిపారు.