ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులపై అధికారిక ప్రకటన
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెల వులు ఉంటాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కలిసి రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే సెలవులు మొదలవుతాయి. మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి.. దసరా సెలవుల అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఆంధ్రప్రదేశ్లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ముఖ్యమైన గమనిక.. దసరా సెలవులపై అధికారికంగా స్పష్టత వచ్చింది. అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించారు. కానీ అక్టోబర్ 10 నుంచి సెలవులు మొదలవుతాయి.. అక్టోబర్ 10న రెండో శనివారం, అక్టోబర్ 11న ఆదివారం కావడంతో ఆ రెండు సెలవులు కూడా సెలవులు ఉంటాయి. దసరా సెలవులు మొత్తం 10 రోజులు కాగా.. శనివారం, ఆదివారం కూడా కలిసిరావడంతో మొత్తం సెలవులు 12 రోజులు అయ్యాయి.. అక్టోబర్ 22న విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇటు క్రిస్ట్రియన్ విద్యాసంస్థలకు అక్టోబర్ 15 నుంచి దసరా సెలవులు ఇస్తారు. ఏపీలో గతేడాది దసరాకు 9 రోజులు సెలవులు ఇవ్వగా.. ఈసారి మొత్తం 12 రోజుల పాటూ ఇచ్చారు.
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు సెలవులు ప్రకటించారు.. అక్కడ మొత్తం 13 రోజుల పాటూ సెలవులు ఇచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు గతంతో పోలిస్తే ఈ ఏడాది దసరా సెలవులు ఎక్కువగానే ఇచ్చారు. ఏపీలో 12 రోజులు కాగా.. తెలంగాణలో 13 రోజుల పాటూ సెలవు లు ఇచ్చారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు ఈసారి దసరా సెలవులతో పండగ చేసుకోనున్నారు. అలాగే ఈ సారి ఏపీలో సంక్రాంతి సెలవులు వారం రోజుల పాటూ వచ్చాయి.
మరోవైపు ఏపీలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మిగిలిన సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుంది. నవంబర్ 19న దీపావళి సందర్భంగా సెలవు.. అలాగే డిసెంబర్లో విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. ఈ ఏడాది క్రిస్మిస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27 వరకు ఉంటాయి. ఇక 2027 జనవరిలో సంక్రాంతి పండుగకు సెలవులు ఉంటాయి.. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మైనారిటీ విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి ప్రారంభమవుతాయి.