చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతిపత్రం
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): చెరువుల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలని విజయనగరం కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఉత్తరాంధ్ర చెరువులు పరి రక్షణ సమితి తీసుకోని వెళ్లింది. విజయనగరం మండలం కనపాకర రెవెన్యూ సర్వే నంబరు 6లో మహంతి చెరువు లో ఆక్రమణలను తొలగించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్య లు చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి డి మాండ్ చేసింది. చెరువులు కబ్జాలపై ఇప్పటికే అనేక ఫిర్యా దులు చేసినప్పటికీ చర్యలు తీసుకోని అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఉత్తరాంధ్ర చెరువు ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగ రపు ఈశ్వర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు ఇప్పలవలస గోపాలరావు, జిల్లా ప్రధాన శ్రీనివాస్ కార్యదర్శి అచ్చిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరావు, శ్రీను, జగదీష్ వినతిపత్రం అందజేశారు.