టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా నోయల్ టాటా ఎంపిక
రతన్ టాటాకు సవతి సోదరుడు అర్భాటాలకు దూరంగా ఉండే నైజం
అక్షర కిరణం, (ముంబై/జాతీయం): టాటా గ్రూప్‌నకు గుండెకాయలాంటి ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నోయల్ టాటా ఎంపికయ్యారు. దీంతో సంస్థకు రతన్‌టాటా తర్వాత ఆయనే ఉత్తరాధికారి అయ్యారు. ఇంతకీ ఎవరీ నోయల్? అరి అందరూ చర్చించుకుంటున్నారు. కంపెనీలో పెద్ద బాధ్య తలు నిర్వహిస్తున్నా ఈయన పేరు వార్తల్లో కనిపించదు. ఆర్భాటాలకు దూరంగా ఉంటారనే పేరుంది.
రతన్ టాటాకు వరుసకు సోదరుడు..
నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. తొలి భార్య సూని సంతా నం రతన్, జిమ్మి. 1940లో ఈ జంట విడిపోయింది. 1955లో సిమోనె అనే స్విస్ వ్యాపారవేత్తను నావల్ వివాహం చేసుకొన్నారు. వారి కుమారుడే నోయల్. టాటా గ్రూప్ రిటైల్ విభాగం విస్తరణకు సిమోనె చాలా శ్రమిం చారు. ఇటీవల కుమారుడు వరసయ్యే రతన్‌ను కడసారి చూసేందుకు ఆమె వచ్చారు. నోయల్ విద్యాభ్యాసం మొత్తం ప్రతిష్ఠాత్మక సంస్థల్లోనే జరిగింది. సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అందుకొన్నారు.
టాటాలో వ్యాపార ప్రస్థానం మొదలు..
విదేశాల్లో వ్యాపారాలు చేసే టాటా ఇంటర్నేషనల్‌లో ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. గ్రూప్ రిటైల్ విభాగమైన ట్రెంట్ లో 1999లో బోర్డు సభ్యుడయ్యారు. ఈ సంస్థను ఆయన తల్లి సిమోనె స్థాపించారు. నోయల్ వచ్చాకే ఆ సంస్థ లిటిల్ ఉడ్స్‌ను కొనుగోలు చేసి.. దానిని వెస్ట్సైడ్గా మార్చింది. 2003లో టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. 2010నాటికి ఆయన టాటా ఇం టర్నేషనల్ ఎండీ స్థాయికి చేరుకొన్నారు. ఆయన హయాం లోనే కంపెనీ 500 మిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు వృద్ధి చేందింది. టాటా రిటైల్ వ్యాపారాలను చూస్తే ట్రెంట్ సంస్థకు 1998లో ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది. నోయల్ దీని బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వే గంగా విస్తరించింది. ప్రస్తుతం 700 శాఖలు ఉన్నాయి.
కీలక బాధ్యతలు నోయల్ చేతిలోనే..
ప్రస్తుతం ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టాటా ఇంటర్నేషనల్‌కు ఎండీ ఆయనే. ఇక టైటాన్, టాటా స్టీల్‌కు వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలూ చూస్తున్నారు. వోల్టాస్ బోర్డు సభ్యుడు కూడా. దాదాపు దశాబ్దం నుంచి ఆయన రతన్ వారసత్వం అందుకొంటారని బలంగా ప్రచారం జరుగుతోంది. మధ్య లో సైర్ మిస్త్రి ఎపిసోడ్ కారణంగా జాప్యం జరిగింది.
ఇక ‘శ్రీదోరబ్జి టాటా’ ‘శ్రీరతన్ టాటా’ ట్రస్టుల్లో ఆయన ట్రస్టీ. ఇవి నిర్వహించే సేవాకార్యక్రమాల పర్యవేక్షణ ఆయనే చూ స్తుంటారు. వ్యాపారం, దాతృత్వంలో టాటా సంప్రదాయాన్ని ఆయన ముందుకు తీసుకెళుతున్నారు. 2024 నాటికి నోయల్ టాటా ఆస్తి విలువ సుమారు రూ.12,400 కోట్లు.
కుటుంబం అండగా..
నోయల్ భార్య ఆలూ పల్లోంజీ మిస్త్రి కుమార్తె. టాటా గ్రూప్‌లో పెద్దమొత్తంలో ఆమె కుటుంబానికి వాటాలు న్నాయి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కుమార్తె లు లేహ, మాయా, కుమారుడు నెవిల్లె ఉన్నారు. వీరందరికి టాటా ట్రస్టులో సభ్యత్వం ఉంది. ఇండియన్ హోటల్స్‌కు వైస్‌ప్రెసిడెంట్‌గా లేహ వ్యవహరిస్తున్నారు. ఇక మాయా ట్రింట్, స్టార్ బజర్ లీడర్షిప్ టీమ్‌లో చేస్తున్నారు. నెవిల్లె స్టార్బజార్, జుడియోను పర్యవేక్షిస్తున్నారు. కిర్లోస్కర్ కుటుంబానికి చెందిన మానసిని నెవిల్లె వివాహం చేసుకున్నారు.