శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్టు వద్దు: ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
అఖిల భారత బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ సిపాన గుణవతి
అక్షర కిరణం, (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని అఖిల భారత బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ సంఘ సేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి అన్నారు. జిల్లా లోని మందస పరిసరాల్లో కార్గో ఏయిర్పోర్టు కాకుండా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీకా కుళం జిల్లాలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం మండలాలు అభివృద్ధికి నోచు కోవడం లేదని ఆమె అన్నారు. యుగాలు గడిచినా ఈ ప్రాంతాల ప్రజలు తలరాతలు మారడం లేదన్నారు. ఎప్పుడు ఈప్రాంతాల బీసీ ప్రజలకు వెట్టి చాకిరి తప్పటం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈప్రాంతాల్లో సహజ సిద్ధ మైన వనరులు పుష్కలంగా ఉన్న అభివృద్ధి అంతంత మాత్రమేన ని చెప్పారు. ఈప్రాంతాల్లో పండే పంటలు కోబ్బరి, మామిడి, పనస, జీడి ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ప్రతి ఏడాది కంటతడి పెడుతున్న ఈ సంబం ధిత పంటలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచన పాలకులకు రాకపోవడం విచారకర మన్నారు. మందస సరిసర ప్రాంతాలలో ఇటీవల సర్వే చేసిన 1300 ఎకరాల స్థలంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారని అయితే ఈ స్థలంలో ఎయిర్పోర్టు కాకుండా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.