7 నుంచి ఏపీలో కొత్త పథకం నేతన్న సేవలో
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్నల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 7న ఈ కొత్త పథకా న్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోగా.. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నేతన్న సేవ లో పథకం కింద అర్హత కలిగిన చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25,000 చొప్పున బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది. చేనేత కార్మికులు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హత ఉంటే చాలు.. ప్రతి కుటుంబా నికి ఈ సాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నేతన్న సేవలో పథకానికి 51,952 మంది అర్హులున్నట్లు ప్రభుత్వం తేల్చింది.
రాష్ట్రవ్యాప్తంగా చేనేత మగ్గం ఉన్న కుటుంబపెద్దకు నేతన్న సేవలో పథకం కింద రూ.25వేలు ఆర్థికసాయం అందిస్తారు. ఒక చేనేత కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఏడాదికి ఒకేసారి ఈ సాయం చేస్తారు. ప్రస్తుతం నేత వృత్తిలో కొనసాగుతూ.. దారిద్య్ర రేఖ కింద ఉన్న కుటుంబం ఈ పథకానికి అర్హులు. అలాగే చేనేత కార్మికులు చేనేతశాఖ డేటాబేస్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ అధికారులు.. ఈ పథకానికి సంబంధించిన అర్హుల ఎంపిక, ఎప్పటికప్పుడు కొత్తవారిని చేర్చడం, జాబితాలోని తప్పులను సరిదిద్దుతారు. అంతేకాదు నేతన్న సేవలో పథకం అమలులో పారదర్శకత, సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితాను సచివాల యాల్లో ప్రదర్శిస్తారు.. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదంతో అర్హుల జాబితాలు సిద్ధం చేస్తారు. ఈ ఏడాది చేనేత కార్మికుల ఉచిత విద్యుత్ పథకానికి ఎంపిక చేసిన అర్హుల జాబితానే నేతన్న సేవలో పథకానికి ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తండా చేనేత కార్మికులు పవర్లూమ్ రంగంతో పోటీపడేలా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. నేతన్నలు వారికి అవసర మైన నూలు కొనుగోలు, మగ్గాల మార్పిడి, మగ్గాల మరమ్మతులు, రంగులు కొనుగోలుకు ఆర్థిక భరోసా కల్పిం చాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. చేనేత లకు 200 యూనిట్లు.. పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు.. ఏప్రిల్ 1 నుంచి పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఉచిత విద్యుత్ అమలుతో చేనేత కార్మికులకు ఏటా రూ.8,640, మర మగ్గాలకు రూ.21,600 వరకు ఆదా అవుతోంది. అలాగే ఏపీ ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు రూ.150 కోట్ల భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ పథకం కింద మొత్తం1.04 లక్షల చేనేత కుటుంబాలు లబ్ధిపొందు తున్నాయి.
చేనేత కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంఈ-పెహచాన్ కార్డును ఇస్తున్నారు. వాట్సాప్‌లో ఈ-పెహచాన్ కార్డును పొందస్తు. వాట్సాప్ ద్వారా ‘ష్ట్రttజూ://tతీఱcశీతీఅఱశీtవc. cశీఎ/wవbaజూజూ/ష్ట్రaఅdశ్రీశీశీఎ/ష్ట్రశీఎవ’ లింక్‌లోకి వెళ్లి.. అక్కడ అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం విజయవాడలోని చేనేత సేవాకేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో వాటిని పరిశీలించి ఆమోదిస్తారు.. అనంతరం కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.