రఘు ఫార్మసీ కాలేజ్‌లో జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రఘు ఫార్మసీ కాలేజ్ లో 4వ జాతీయ ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈనెల 17న ప్రారంభమైన వారో త్సవాలు 23తో ముగియనున్నాయి. రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫార్మ కాలజీ విభాగం సభ్యులు, రోగి భద్రత కోసం ఏడీఆర్ (ప్రతి కూల ఔషధప్రతిచర్యలు) రిపోర్టింగ్ సంస్కృతిని నిర్మించ డం అనే థీమ్ మీద వ్యాసరచన, వక్తృత్వం, ఇలస్ట్రేషన్ పోటీలను నిర్వహించారు. ఈనెల 21న ఫార్మాకోవిజిలెన్స్ థీమ్‌పై అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించి, పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు వాలెడిక్టరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథి, ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్. ఎస్.వినుత, ఏడీఆర్, ఏడీఆర్ రకాలు, ప్రతికూల డ్రగ్ ప్రతిచర్యలను ఎలా నివారించాలనే విష యాలను వివరించారు. ఏడీఆర్ (ప్రతికూల ఔషధ ప్రతి చర్యలు) ఎవరికి నివేదించాలి, ఎక్కడ నివేదించాలి ఎలా నివేదించాలి అన్న దానిపై డాక్టర్ ఆదిత్య వివరించారు. పోటీల్లో విజేతలు, రన్నరప్‌లకు బహు మతులు పంపిణీ చేశారు. రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫె సర్, ప్రిన్సిపాల్, డాక్టర్ జగదీష్ పాండా, ప్రొఫెసర్, వైస్ ప్రిన్సి పాల్ డాక్టర్ కె. పద్మజ, కో-కన్వీనర్, ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి పుట్ట, రఘు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.