12న జాతీయ లోక్ అదాలత్
Åజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): కోర్టుల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను సులభంగా, సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జీవీఎంసీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న ఉదయం 9 గంటల నుంచి లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో, జీవీఎంసీకి సంబంధించిన వివిధ అంశాలపై నోటీసులు అందుకున్న వ్యక్తులు, సంస్థలు, కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరస్పర అంగీకారంతో తమ సమస్యల ను పరిష్కరించుకోవాలని కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో కోరారు.
జీవీఎంసీ పరిధిలోని భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, గాజువాక, పెందుర్తి, అగనంపూడి, అనకాపల్లి జోన్లకు సంబంధించి రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం తదితర విభాగాల పరిధిలో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను జాతీయ లోక్ అదాలత్లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వెచ్చించకుండా, పెండింగ్లో ఉన్న సమస్యలను పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని, జీవీఎంసీకి సంబంధించిన నోటీసులు అందుకున్నవారు, కోర్టు కేసులు పెండింగ్లో ఉన్న వ్యక్తులు, సంస్థలు సెప్టెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి తమకు సంబంధించిన న్యాయస్థానాలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు.