ఓపస్ పెయింట్లో ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉద్యోగాలు
అక్షర కిరణం, (మాధవధార): ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, విశాఖపట్నంలో డిప్లొమా కెమికల్ విద్యార్థులకు ఓపస్ పెయింట్, ఆదిత్య బిర్లా గ్రూప్, చెయ్యర్ యూనిట్, తáమిళనాడు ఉద్యోగాల కోసం క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ నిర్వహించారు. దీనిలో ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాల సాధించారు. కర్రి దేష్ణా (కెమికల్ ఇంజినీరింగ్), ఎస్.నిఖిలేంద్రకుమార్ (కెమికల్ ఇంజినీ రింగ్) సీవీ రెడ్డయ్య (కెమికల్ ఇంజినీరింగ్- పెట్రోకెమి కల్స్) ఉద్యోగాలు సాధించారు. ఈసందర్భంగా ప్రధానోపా ధ్యాయులు ఐకేవీ రమణపై ఉద్యోగాలు సాధించిన విద్యార్థు లను అభినందించి వారికి నియామక పత్రాలను అందచే శారు. వీరికి ఏడాదికి రూ.3,30,000 జీతం లభిస్తుందని తెలిపారు. వసతి, భోజన సదుపాయం, ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించనున్నారని తెలిపారు.