ఘనంగా ఉచిత సామూహిక శ్రావణ మాసం కుంకుమ పూజలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలతో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మ వారి దేవస్థానంలో శుక్రవారం ఉచిత సామూహిక శ్రావణ మాసం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజలను రెండు విడతలుగా నిర్వహించగా, మొత్తం 396 మంది భక్తులు పాల్గొన్నారు. గత నెల 13 న ప్రారంభమైన శ్రావణ లక్ష్మీ పూజలు శుక్రవారం మహా పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రావణ లక్ష్మీ పూజా కార్య క్రమంలో 45 మంది ఉభయదాతలు పాల్గొని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపకమిషనరు, కార్య నిర్వహణాధికారిణి కె.శోభారాణి, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు ఎంవీ రాజశేఖర్, పి. జగన్ మోహన్ రావు, ఎంకేవీవీ సత్యనారా యణ, ధర్మకర్తల మండలి ధర్మకర్తలు టి.వేణికుమారి, సీహెచ్.మంజుల, డి.శ్రీకాంత్, ఎం.నాగ సుధ, టి.నాగమణి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె.పద్మజ, సహాయ ఇంజినీరు కె. సూర్యనారాయణ మూర్తి, పర్యవేక్షకులు ఎంవీ రమణ, బి. అనురాధ, వేదపండితులు, అర్చకులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.