మంత్రి నారా లోకేష్‌కు గంట్ల శ్రీనుబాబు
సింహాద్రినాథుడి జ్ఞాపిక బహుకరణ
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం శ్రీ వరాహ లక్మీ నృసింహ స్వామిని గురువారం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, విశాఖ విమానాశ్రయము సలహా మండలి సభ్యుడు, జాతీయ జర్నలిస్ట్‌ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి శ్రీనుబాబు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శ్రీనుబాబు మంత్రి లోకేష్‌కు సింహాద్రి నాథుడి జ్ఞాపికను బహుకరించారు.