ఏపీలో మరోసారి మున్సిపల్ ఎన్నికలు
î23 స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 23 స్థానిక సంస్థలకు ఈనెల 26వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో సంబంధిత పురపాలక ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్లలోని 260 డివిజన్లతో పాటు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిది óలోని వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. పెండింగ్లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ని ఎసఈసీ అనిల్ చంద్ర పునేఠ రిలీజ్ చేశారు. ఈ మేరకు 23 స్థానిక సంస్థలకు ఈనెల 26న పోలింగ్ నిర్వహిస్తారు.30న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో సంబంధిత పురపాలక ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరణ ఉంటుంది. నవంబర్ 17వ తేదీన అధికారులు నామినేషన్లు పరిశీలిస్తారు. అలాగే అభ్యర్థుల నామినేషన్లను వెనక్కి తీసుకోవడానికి నవంబర్ 19వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఇక నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, నవంబర్ 30న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది.
ఈ కార్పొరేషన్లలో ఎన్నికలు
తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన ్లలోని 260 డివిజన్లతో పాటు, 19 మున్సిపాలిట ¡లు, నగర పంచాయతీల పరిధిలోని 749 వార్డుల్లో ఎన్నికలు జరగ నున్నాయి. గతంలో న్యాయపరమైన వివాదాలు, వార్డుల పునర్విభజన వల్ల ఈ 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎలక్షన్ ఆగిపోయింది. రీసెంట్గా హైకోర్టులో లీగల్పరమైన అడ్డంకులు తొలగిపోవడం, రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం క్లియర్ అయింది.
మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
మరోవైపు ఏపీలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. మొదటి దశకు శుక్రవారం నోటిఫికేషన్ అధికారులు రిలీజ్ చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి దశ ఎన్నికలు నవంబర్ 26న, రెండో విడతలో నవంబర్ 29న, మూడో విడతలో డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రతి విడతలోనూ పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.