ఏపీ పింఛన్ల పంపిణీ విధానంలో స్వల్ప మార్పు..
Åనవంబర్ 1 నుంచి చేతికి కొంత.. ఖాతాలోకి కొంత
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ పింఛన్ల పంపిణీ లో స్వల్ప మార్పు జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ విధానంలో చిన్న మార్పు జరగనుంది. ఈ మేరకు పింఛన్ డబ్బులో కొంత చేతికి ... కొంత అకౌంట్లో పడనుంది. ఇప్పటి వరకు ఒకటో తేదీ రాగానే సచివాలయ సిబ్బంది మొత్తం డబ్బులు తీసుకొచ్చి లబ్ధిదారుల చేతికి ఇచ్చేవారు. ఇకపై పింఛన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా అని రెండు భాగాలుగా విడదీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద వచ్చే కేంద్ర ప్రభుత్వ వాటా డబ్బులు డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్లో పడతాయి. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులను మాత్రం సచివాలయ సిబ్బంది ప్రతినెలా ఇంటికే వచ్చి చేతికి అందిస్తారు. ఈ కొత్త విధానంపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్చ్ ్పుజుO వాకాటి కరుణ కూడా క్లారిటీ ఇచ్చారు.
ఎంత చేతికి ఇస్తారు..? ఎంత ఖాతాల్లో పడుతుంది?
ఇప్పటి వరకు ఎన్టీఆర్ భó„రోసా పథకం కింద లబ్ధిదారులకు మొత్తం పెన్షన్ డబ్బును చేతికి ఇచ్చేస్తున్నారు. వచ్చే నెల నుంచి అందులో స్వల్ప మొత్తాన్ని వారి వారి అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకుంటే వృద్ధులకు ప్రతి నెలా మొత్తం రూ.4,000 పింఛన్ వస్తోంది కదా. ఈ నాలుగు వేల రూపాయల్లో రూ.3,800 రాష్ట్ర ప్రభుత్వ వాటా.. ఈ రూ.3,800లను సచివాలయ సిబ్బంది ఒకటో తేదీన పెన్షన్‌దారుల ఇంటికి వచ్చి చేతికి అందిస్తారు. మిగిలిన రూ.200లు కేంద్ర ప్రభుత్వ వాటా. వీటిని సచివాలయ సిబ్బంది ఇవ్వరు, అవి నేరుగా పెన్షన్‌దారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అదే విధంగా దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.6,000 పింఛన్ ఇస్తోంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.5,700 వారి చేతికి అందిస్తారు. మిగిలిన రూ.300 కేంద్ర ప్రభుత్వ వాటా కిందకి వస్తుంది. వీటిని డైరెక్ట్‌గా వాళ్ల బ్యాంక్ అకౌంట్లో పడతాయి.
బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి..
అయితే కేంద్రం ఇచ్చే ఈ డబ్బులు బ్యాంక్‌లో పడాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టింది ప్రభుత్వం. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి కచ్చితంగా వారి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అకౌంట్‌కు ఆధార్ కార్డు అనుసంధానం లేకపోతే మాత్రం ఆ కేంద్ర వాటా డబ్బులు బ్యాంక్‌లో జమ కావు. కాబట్టి పింఛన్ తీసుకునే వాళ్లంతా వెంటనే తమ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఆధార్ లింక్ అయి ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ లింక్ అయి లేకపోతే వెంటనే అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అసలెందుకీ మార్పు...?
సడన్‌గా ఈ మార్పు చేయడానికి కచ్చితమైన కారణాలున్నాయి. ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కొత్త రూల్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే కేంద్ర నిధుల పంపిణీలో మధ్యవర్తుల దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. అలాగే ఈ మార్పు వల్ల కేంద్రం నుంచి ఎంత డబ్బు వస్తోంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది అనేది ప్రజలకు క్లియర్‌గా తెలుస్తుంది.ఇప్పటి వరకు చాలామందికి కేంద్ర ప్రభుత్వం కూడా పింఛన్లలో వాటా ఇస్తుందనే విషయం సరిగ్గా తెలియదు, ఇకపై ఆ అవగాహన ఏర్పడుతుంది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్‌దారులకు కచ్చితంగా ఎన్టీఆర్ భరోసా అందుతుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు.