నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి
కరాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్
కపెదటాడివాడ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
అక్షర కిరణం, (డెంకాడ/విజయనగరం): ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దీనికోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. డెంకాడ మండలం పెద తాడివాడ వద్ద రూ.2.8కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమ వారం భూమిపూజ చేశారు. మంత్రి రవికుమార్ మాట్లాడు తూ విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే పెద్ద ఎత్తున మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సుమారు 78,000 విద్యుత్ కనక్షన్లను మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాదిలోనే జిల్లాలో ఇప్పటికే 6 సబ్ స్టేషన్లను ప్రారంభించామని, మరో 3 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం క్రింద దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు సోలార్ విద్యుత్ కనక్షన్ ఇవ్వాలని లక్ష్యం కాగా, వాటిలో 20 లక్షలను మన రాష్ట్రానికే కేటాయించడం గర్వకారణమన్నారు. వీటిని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ నియోజకవర్గానికి కొత్తగా 5, తీరప్రాంతాని కొక విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయాలని కోరామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృధ్వీతేజ్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఏపీఈపీడీసీిఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణ రావు, ఆర్డీవో డి.కీర్తి, ఎంపీపీ బి.వాసుదేవరావు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.