పోలమాంబ అమ్మవారికి మంత్రి సంధ్యారాణి పట్టు వస్త్రాల సమర్పణ
అక్షర కిరణం (సాలూరు): గిరిజనుల ఆరాధ్యదైవం కోర్కెలు తీర్చేకల్పవల్లి శంబర శ్రీపోలమాంబ అమ్మవారికి స్త్రీశిశుసంక్షేమ గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి.కుటుంబ సభ్యులు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నైదాన తిరుపతిరావు.కలిసి శంబర, పోలమాంబ అమ్మవారి కి పట్టు వస్త్రాలను మంగళవారం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణికి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నైదాన తిరుపతిరావు, మునుపెన్నడూ లేనివిధంగా మామిడిపల్లి జంక్షన్ నుండి శంబర జాతర వరకు దారిపొడువునా పెద్ద పెద్ద ప్లెక్సీలు,బ్యానర్లతో డప్పుల వాయిద్యాలతో పూలబోకెలతో ఆహ్వానం పలికారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంబర పోలమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించటం తమ అదృష్టమన్నారు. కార్యక్రమంలో శంబర జాతర ఉత్సవకమిటీ చైర్మన్ నైధాన తిరుపతిరావు ఉత్సవ కమిటీ సభ్యులు, శంబర యూత్ లీడర్ సూర్యయాదవ్. ఆలయ ధర్మకర్త ఎండోమెంట్ ఈఓ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.