విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): వర్షాకాలంలో విద్యార్థు లకు వ్యాధుల నుంచి రక్షణ కల్పించడమే కూటమి ప్రభు త్వం ధ్యేయమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంట మండలం బద్నాయక వలస గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దోమతెరలను గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పంపిణీ చేశారు. జిల్లాలో తొలిసారిగా పాచిపెంట మండలం నుంచే దోమతెరల పంపిణీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత, విద్యార్థులకు ఆరోగ్యకర వాతావరణం కల్పించడ మే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గిరిజన సంక్షేమం, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. కార్యక్రమంలో మెడి కల్ అధికారి, డాక్టర్ శివకుమార్, మెడికల్ అధికారులు సిబ్బంది, మండల నాయకులు యుగంధర్ సూర్యనారా యణ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.