గుచ్చిమిలో కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
అక్షర కిరణం, (సాలూరు): సీతానగరం మండలం, గుచ్చిమి గ్రామంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించగా, ప్రత్యక్షంగా గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రత్యక్షంగా బుధ వారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పాలమనేరు ముసలమడుగు శిబిరం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన కుంకి ఏనుగులు జయంత్, అభిమన్యులను ఏనుగులను గుచ్చిమి శిబిరానికి తరలించారు. ఈసందర్భంగా కుంకి ఏనుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాటి సంరక్షణ, నిర్వహణ ఏర్పాట్లను మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. శిబిరంలోని సౌకర్యా లు, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ, మావటీలకు కల్పించిన వసతులపై అధికారులతో సమీక్షించారు. ఇక్కడి వాతా వరణం పరిస్థితిలు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, అటవీశాఖ అధికారులు తగిన సూచనలు ఇచ్చి సృష్టం చేశారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్చంద్ర, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, కలెక్టర్, ప్రభాకర రెడ్డి, ఐటీడీఏ పీవో వైశాలి, జిల్లా అటవీశాఖ అధికారి, ప్రసూన, అటవీశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.