8న నాక్ సెంటర్లో మెగా జాబ్ మేళా..
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): గాజువాకలో ఈనెల 8న నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో పెద గంట్యాడ ఎన్ఎసీ (నాక్) సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తు న్నామని జిల్లానైపుణ్యాభివృద్ధి అధికారి టీ చాముండేశ్వర రావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో బంధన్ బ్యాంక్, బిగ్ బాస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ పే కంపెనీలు పాల్గొంటా యని చెప్పారు. ఎస్ఎస్సీ, ఇంటర్ ఎనీ డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగ యువత హజరు కావాలని కోరారు. ఎంపిక అయిన అభ్యర్థులందరూ విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకా కుళం విజయనగరం జిల్లాలలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 79810 22453 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని తెలియజేశారు.