అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై సేవా సంఘాలతో సమావేశం
అక్షర కిరణం, (మాధవధార): ఈనెల 30వ తేదీ అక్షయ తృతీయ సందర్భంగా సింహాద్రి నాధుని నిజరూప దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం సేవా సంఘాలతో గురువారం సింహగిరి క్యూ కాంప్లెక్స్ బిల్లింగ్‌లో సమావేశం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు ఆదేశాల మేరకు డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు డీఈ నాగేశ్వరరావు ఏఈ సూరిబాబు, తాతాజీ సేవా సంఘాల అధినేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమన్వయ సమావేశంలో సేవా సంఘాలు భక్తులకు కల్పించే ప్రసాద ములు చక్రపొంగలి, పులిహోర వితరణ బిస్కెట్స్ గ్లూకోస్, పాలు, లెమన్ వాటర్, బటర్‌మిల్క్, ఫ్రూట్స్ వంటి పదార్థాలు భక్తులకు అందించే వివిధ సేవలపై సేవా కార్యక్రమాల వివరాలు తెలిపారు. సమావేశంలో ఆంధ్ర లేఖ చారిటబుల్ ట్రస్ట్, శంబల చారిటబుల్ ట్రస్ట్, శ్రీశ్రీ లలితదేవి సేవా సంఘం, వెంకట అన్నమా చార్య సేవా సంఘం, శ్రీశ్రీ గోపాలబాబా చారిటబుల్ ట్రస్ట్, శ్రీవిజయలక్ష్మి ట్రేడర్స్, సంస్కార్ భారతి సేవా సంఘం, హరికృష్ణ మూమెంట్స్ హ్యాపీ ఇండియా సొసైటీ హనుమాన్ సేవా సంఘం 30కి పైగా సేవా సంఘాలు సమావేశంలో పాల్గొన్నాయి.