ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): విజయ నగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా జిల్లా కేంద్రంలోను, ఇతర ప్రాంతాల్లోను ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలు ప్రశాంతంగా ముగిసాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. మహహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం - హిందూవులు ర్యాలీ నిర్వహించారన్నారు. ఎస్.కోట, రాజాం, కొత్తవలన, బొబ్బిలి, విజయనగరం ఇతర ప్రాంతాల్లో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు నిర్వ హించారని తెలిపారు. విజయనగరం అబాదవీధి నుండి ప్రారంభమైన ర్యాలీ కోట జంక్షన్, సింహాచలం మేడ, బాలా జీ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషను రోడ్డు, కన్యకా పర మేశ్వరి టెంపుల్, గంట స్థంభం, పైడితల్లమ్మ టెంపుల్, మూడు లాంతర్లు మీదుగా తిరిగి అబాదవీధికి చేరింద న్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాట్లు చేప ట్టిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బందోబస్తులో విజయనగరం 1వ, 2వ పట్టణ సీఐలు ఎస్.శ్రీనివాస్, టి. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్ఐలు ప్రసన్నకుమార్, నరేష్, హరిబాబునాయుడు, సుదర్శన రావు, సూర్యకుమారి, దుర్గాప్రసాద్, వీర జనార్ధన్, చిన్నారావు, లోవరాజు, శంబంగి రవి, మహేశ్వర రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.