విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు
అక్షర కిరణం, (మాధవధార): విశాఖపట్నం అప్పయ్య నగర్ మర్రిపాలెం ఆర్ అండ్ బీ జంక్షన్లో కొలువైవున్న శ్రీ భూ సమేత విజయ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 1న శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని లక్ష్మీదేవికి కుంకుమార్చనలు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి పీఎస్ఎన్ మూర్తి ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో మూర్తి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని లక్ష్మీదేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు.