వాల్తేర్ డివిజన్ డీఆర్ఎంగా మనోజ్‌కుమార్ సాహూ బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం)గా మనోజ్‌కుమార్ సాహును రైల్వే శాఖ నియమించింది. ఆయన గురువారం డీఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించి నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ గురు వారం తెలిపారు. ఇన్నాళ్లు డీఆర్ఎంగా విధులు నిర్వహిం చిన సౌరబ్ ప్రసాద్‌పై అవినీతి కేసు నమోదవడంతో, వాల్తేర్ రైల్వేలో(ఆపరేషన్స్) ఏడీఆర్ఎంగా విధులు నిర్వహి స్తున్న మనోజ్‌కుమార్ సాహుకు ఈ బాధ్యతలు అప్పగిం చారు. ఈసందర్భంగా డీఆర్ఎఎం మనోజ్‌కుమార్ మాట్లా డుతూ ప్రయాణికుల అవసరాలను గుర్తించి డివిజన్ పరిధిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రయాణికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. వారికి ఆనందకరమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు తన పరిధిలో కృషి చేస్తానని పేర్కొన్నారు.