పోర్ట్, డాక్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్మిక సమాఖ్య కార్యదర్శిగా మంగయ్య నాయుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): బీజేపీ నాయకుడు మంగయ్య నాయుడు ఆల్ ఇండియా పోర్ట్, డాక్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శిగా ఎన్నిక య్యారు. మంగయ్య నాయుడు విశాఖ పట్నం పోర్ట్ ఎంప్లాయిస్ యూనియన్‌లో 1976 నుంచి సభ్యునిగా ఉన్నారు. పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 35 సంవత్సరాలు ఉద్యోగం చేసి 2014లో ఉద్యోగ విరమణ పొందినప్పటికి యూనియన్‌లో కార్మికుల కు సేవలందిస్తున్నారు. 2021లో యూని యన్ కోశాధికారిగా భాధ్యతలు చేపట్టారు. 2022లో ఆల్ ఇండియా పోర్ట్, డాక్ వర్కర్స్ ఫెడరేషన్‌కి ఆర్గనైజయింగ్ సెక్రటరీగా నియమితుల య్యారు. ఈక్రమంలో ఈనెల 11వ తేదీన జరిగిన ఫెడరేషన్ నేషనల్ కన్వెన్షన్‌లో సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా మంగయ్య నాయుడు మాట్లాడుతూ పోర్టు ల జాతీయ కార్మిక సమాఖ్య కార్యదర్శిగా తనను నియమించినందుకు ఫెడరేషన్ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఉన్న ప్రధాన రేవులలో పనిచేస్తున్న కార్మికు లకు సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన భాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని మంగయ్య నాయుడు పేర్కొన్నారు.