ముగిసిన మండల స్థాయి క్రీడా జట్టు ఎంపికలు
అక్షరకిరణం, (వజ్రపుకొత్తూరు): వజ్రపు కొత్తూరు మండలంలోని నగరంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండో రోజు జరుగుతున్న మండల స్థాయి అండర్-14, అండర్-17 విభాగాలలో బుధవారం ఖోఖో, వాలీబాల్, చెస్ ఎంపికలు నిర్వహిం చారు. మండలంలోని 16 ప్రభుత్వ, ప్రైవేట్ హైస్కూల్స్ నుంచి సుమారు 190 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో 77 మంది డివిజనల్ స్థాయి పోటీలకు మండల టీంగా అర్హత సాధించారు. ఈనెల 15 -17 వరకూ పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే పోటీలలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం వజ్రపుకొత్తూరు ఎంఈఓ బి.వెంకటరమణ, ప్రధానోపాధ్యాయులు టి.హేమారావు, ఎస్ఎంసీ చైర్మన్ బి.లక్ష్మిపతి, మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి.గజేంద్రరావు, వ్యాయమ ఉపాధ్యాయులు జే. నారాయణ, మున్నా, శివ, రమ్య, వెంకటేశ్వరి, శ్రీను, కోటి, హరి, వాణికుమారి తదితరులు పాల్గొన్నారు.