ఆర్జేడీ నేత రాజ్‌కుమార్ రాయ్ దారుణ హత్య
కబీహార్ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకంపనలు
అక్షరకిరణం, (పట్నా/జాతీయం): బీహార్ రాజకీయా లు మరోసారి రగిలిపోయాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు రాజ్‌కుమార్ రాయ్ అలియాస్ అల్లా రాయ్‌ను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఈ దారుణ హత్య బుధవారం రాత్రి పట్నాలోని చిత్రగుప్త ప్రాంతంలోని మున్నాచక్‌లో జరిగింది. ఆర్జేడీ నేత రాజ్‌కుమార్ రాయ్ రాబోయే ఎన్నికల్లో రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయా లని ఆశించారని రాజకీయ వర్గాలతో తెలుస్తోంది. అయితే కాల్పుల తర్వాత ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి నప్పటికీ.. అప్పటికే ఆయన మరణించి నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో బిహార్ రాజకీ యాల్లో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ దాడి వెనుక భూ వివాదాలు కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. రాజ్‌కుమార్ రాయ్ భూ సంబంధిత వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన స్థలం నుంచి ఆరు బుల్లెట్ క్యారేజీలను స్వాధీనం చేసుకున్నారు.
పట్నా ఈస్టర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సేకరించినట్లు తెలిపారు. అందులో నిందితులు ఈ నేరానికి పాల్పడినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం నిందితులను పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడిరచారు. ఆధారాల సేకరణ కోసం ఒక ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలాన్ని సందర్శిం చింది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉండడం.. అందులోనే పోటీ చేయాలనుకున్న ఆర్జేడీ నేతను హత్య చేయడంతో.. అంతా షాక్ అవుతున్నారు. రాజకీయ కక్షలే ఈ దారుణానికి కారణమా అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ నాయకులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.