ముయిజ్జును దింపేందుకు భారత్‌తో కలిసి మాల్దీవుల ప్రతిపక్షం కుట్ర
వాషింగ్టన్ పోస్ట్ సంచలన నివేదిక భారత్ నుంచి 6 మిలియన్ డాలర్లు కోరినట్టు నివేదిక
అక్షర కిరణం, (వాషిగ్టన్/ఢల్లీి/అంతర్జాతీయం): మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మెయిజ్జును గద్దె దింపడా నికి భారత్ కలిసి ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. మొయిజ్జును అభిశంసనతో పదవీచ్యుతుడ్ని చేయాలంటే తమకు 6 మిలియన్ డాలర్లు సమకూర్చాలని భారత్‌ను కోరినట్టు నివేదించింది. అధ్యక్షుడిపై అభిశంసన ప్రవేశపెట్టి.. దానికి అనుకూలంగా ఓటేసేందుకు మొయిజ్జు పార్టీ ఎంపీలు సహా 40 మందికి డబ్బులు ఇవ్వడానికి మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష నాయకులు ప్రతిపాదన చేశా రని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ఈ ఆరోపణలను మాల్దీ వుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ తోసిపుచ్చారు. ముయిజ్జు కు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్ర గురించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఇటువంటి చర్యలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం తాను ఇప్పుడే చదివానని అన్నారు.
‘అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతున్నట్టు నాకు తెలియదు.. కొంతమంది ఎప్పుడూ ఇలాంటి వాటిలోనే నిమగ్నమై ఉంటారు.. భారత్ అటువంటి చర్యలకు మద్దతు ఇవ్వదని భావిస్తున్నాం. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యానికే మద్దతు ఇస్తుంది.. మాకు భారత్ ఎలాంటి నిబంధనలు విధించ లేదు’ అని మహ్మద్ నషీద్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
వాషింగ్టన్ పోస్ట్ ‘మాల్దీవుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రయత్నం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో.. ‘అధ్యక్షుడు అభిశంసనకు ఓటు వేయాలని మాల్దీవుల ప్రతిపక్ష రాజకీయ నాయకులు ముయిజ్జు పార్టీకి చెందిన వారితో సహా 40 మంది ఎంపీలకు లంచం ఇవ్వాలని ప్రతి పాదించారు.. మూడు శక్తివంతమైన క్రిమినల్ ముఠాలు, వివిధ పార్టీలకు చెల్లించడానికి కుట్రదారులు 87 మిలి యన్ మాల్దీవుల రూపాయలు లేదా 6 మిలియన్ డాలర్లు కోరారు.. మాల్దీవుల అధికారుల ప్రకారం.. ఈ మొత్తం భారత్ నుంచి కోరారు. భారత గూఢచార సంస్థ ‘రా’కు చెందిన ఒక సీనియర్ అధికారి.. మొయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల తర్వాత ఆయనను పదవీచ్యుతుడి ని చేసే ప్రణాళికను రూపొందించారు’ అని ఆరోపించింది.
కాగా, సోమవారం వెలువడిన ఈ నివేదికపై భారత విదే శాంగ శాఖ ఇంకా అధికారంగా స్పందించలేదు. అయితే, మొయిజ్జు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు భారత్ సాయం కోరారనే ఆరోపణలను తీవ్రంగా ఖండిరచినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.