తనిష్క్లో పట్టపగలే భారీ చోరీ
îరూ.50 కోట్ల విలువైన 20 కిలోల నగలు అపహరణ
అక్షర కిరణం, (మధురై/జాతీయం): తమిళనాడు లోని మదురైలో భారీ చోరీ జరిగింది. పలంగనాథంలో తనిష్క్ షోరూమ్‌లో గురువారం తెల్లవారుజామున షట్టర్లు పగలుగొట్టి రూ.50 కోట్ల విలువైన నగలను దొంగలు అపహరించారు. మొత్తం 15 నుంచి 20 కిలోల వరకు బంగారం ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నిర్వాహ కులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసు లు.. దర్యాప్తు చేపట్టారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. పై అంతస్తు నుంచి లిఫ్ట్ ద్వారా ఒకే అనుమానితుడు భవనంలోకి ప్రవేశిస్తు న్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని పోలీసులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి మాస్క్ ధరించిన గుర్తుతెలియని వ్యక్తి షోరూమ్‌లోకి ప్రవేశించి, నగలను దోచుకెళ్లాడు. ఈ షోరూమ్ 10 రోజుల కిందటే ప్రారంభించారు. షోరూమ్‌లోని ఇంటీరియర్, ఇతర పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయని సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చోరీ క్రమాన్ని, అనుమానితుడ్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాగిలాలను రప్పించి, ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఫోరెన్సిక్ నిపు ణులు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మధురైన సీపీ రాజేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ షోరూమ్‌లోని మొత్తం బంగారు ఆభరణాలలో సుమారు 30 శాతం చోరీకి గురయ్యాయని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.