విశాఖకు మహార్దశ: వందెకరాల్లో తాజ్ హోటల్!
అక్షర కిరణం, (విశాఖపట్నం): సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా వరుసగా కేంద్రంతో సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతోపాటుగా అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. మరోవైపు రాజ ధానితోపాటుగా విశాఖపై కూడా దృష్టి కేంద్రీకరించారు.
ఇటీవలే విశాఖకు టీసీఎస్ కార్యాలయం రానుందని, దీంతో స్థానికంగా, ఆర్థికంగా విశాఖ మరింత అభివృద్ధి చెందుబోతుందంటూ మంత్రి నారా లోకేశ్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. దీంతోపాటుగా విశాఖలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆతిథ్య, సేవా రంగ సంస్థ తాజ్ గ్రూప్ ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ హోటల్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది.
ఈనేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులు రెండు రోజులుగా విశాఖలో హోటల్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను పరిశీ లన చేస్తున్నారు. బుధ, గురువారాల్లో విశాఖ, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కొన్ని స్థలా లను పరిశీలించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో తీరానికి సమీపంలో వంద ఎకరాలు కేటాయిస్తే భారీ హోటల్ నిర్మించేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలు స్తోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్ర యానికి సమీప ప్రాంతాల్లోనూ తాజా గ్రూప్స్ నుంచి వచ్చిన సిబ్బంది పరిశీలించారు. తాజ్ ప్రతినిధులకు పర్యాటక, రెవెన్యూశాఖ అధికారులు ఆ భూములను చూపించారు.
తాజ్ గ్రూప్స్ విశాఖకు వస్తే స్థానికంగా ఉండేవారికి ఆదాయం పెరగడంతో పాటుగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా భారీగా వస్తాయి. హోటల్ ఏర్పాటు చేసే ప్రాంతం బీచ్‌కి దగ్గరగా ఉన్నందున పర్యాటకులు కూడా ఆసక్తి చూపే ఛాన్స్ ఉంది.