సంజీవ్ కాలనీ`2లో మహాన్నదానం
అక్షర కిరణం, (కంచరపాలెం): జీవీఎంసీ 47వ వార్డు సంజీవ్ కాలనీ 2 శ్రీ దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ మహిషాసుమర్దిని దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కుంకుమార్చన పూజ కార్యక్రమం నిర్వహించి, అనంతరం జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఈఅన్నదాన కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో దుర్గమ్మ మహిళా సంఘం సభ్యులు, నిర్వాహకులు, గ్రామపెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.