లీలా మాధవస్వామి ఆలయంలో ఘనంగా మాఘమాస వేడుకలు
అక్షర కిరణం, (మాధవధార): ఎంతో విశిష్టత కలిగిన మాధవధారలోని శ్రీ లీలా మాధవస్వామి దేవాలయంలో ఆదివారం వైభవంగా మాఘ మాస వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వరహా నరసింహం, శ్రీనివాసం, గోవింద, రవీంద్రకుమార్ ఆధ్వర్యం లో మాఘ మాసంలో వచ్చే రెండవ ఆదివారం సందర్బంగా సందర్బంగా మాధవస్వామి ఆలయం వద్ద వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తజనం పోటెత్తారు. ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. తెల్లవారు జాము నుంచి మాధవధార వద్ద గల జలధారలో భక్తుల పుణ్యస్నానాలతో ఈప్రాంతం అంత జనసంద్రంగా మారింది. మాఘమాసం రెండవ ఆదివారం కావడంతో మాధవస్వామి తీర్థం సందర్భంగా ఒడిసా, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుండి భక్త జనం వేలాదిగా తరలి వచ్చి లీలా మాధవస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో సనపల సూర్యనారాయణ, అన్నపూర్ణ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు సనపల సత్యనారాయణ, పద్మావతి దంపతుల దంపతులు సుమారు 1600 మంది భక్తులకు అన్నదానం చేశారు. కంచరపాలెం పీఎస్ లా అండ్ ఆర్డర్ సీఐ కె.రవి కుమార్, ఎస్ఐ ఎం.రవికుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సనపల బంగార్రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది, మాధవధార స్థానికులు పలు ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో సనపల సత్యనా రాయణ, పద్మవతి, పప్పల వరహానరసింహం తదితరులు పాల్గొన్నారు.